ఎం.పి.ల స్వాహాపై స్తంభించినఅసెంబ్లీ
హైదరాబాద్‌ః వరంగల్, హన్మకొండ పార్లమెంటు సభ్యులు ఎం.పి. నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే అంశంపై అసెంబ్లీ అరగంటకుపైగా స్తంభించిపోయింది. వరంగల్ ఎం.పి. చాడ సురేష్ రెడ్డి, హన్మకొండ ఎం.పి. టి. వెంకటేశ్వర్లు ఎం.పి.ల నిధులను దుర్వినియోగం చేశారంటూ ఇటీవల ఒక దినపత్రిక ఫోటోలతో సహా ప్రచురించింది. ఈ అంశం శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ప్రతిభా భారతి త్రోసిపుచ్చారు. దీంతో కాంగ్రెస్, టిఆర్‌ఎస్ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.












Click it and Unblock the Notifications
