రాష్ట్రపతిగా కలాం ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీః భారత 12వ రాష్ట్రపతిగా డాక్టర్‌ ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం కన్నుల పండుగగా జరిగిన కార్యక్రమంలో 71 ఏళ్ళ ఈ అణుశాస్త్రవేత్త భారతదేశ అత్యున్నతపీఠాన్ని అలంకరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వందమందికిపైగా చిన్నారులు, రామేశ్వరం నుంచి వచ్చిన ఆయన అన్నగారి కుటుంబ సభ్యులు, ప్రధాని వాజ్‌పేయి, ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదవీవిరమణ చేసిన రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌ వెంటరాగా కలాం రాష్ట్రపతి పదవిని చేపట్టారు.

ఈ సందర్భంగా కలాం మాట్లాడుతూ భారతదేశం ప్రస్తుతం సీమాంతర ఉగ్రవాదం నిరుద్యోగం వంటివిషమ సమస్యలను ఎదుర్కొంటున్నదని, ఈ సమస్యలను అధిగమించి అభివృద్ధి పథంలో పురోగమించేందుకు మంచి ధృక్పథం అవసరం అని ఆయన అన్నారు. చిన్న లక్ష్యం నేరం.... మహోన్నత లక్ష్యమే అభిలషణీయం...... అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌మిగిలిపోరాదు... అభివృద్ధి చెందిన భారతావనే మా ఆకాంక్ష అనేఅర్థం వున్న సొంతగా రాసిన గీతాన్ని కలాం స్కూలు పిల్లల చేత పాడించారు.

కలాం కు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు ఈ సందర్భంగా శుభాకాంక్షలుఅందించారు. మేధావి అయిన కలాం సారధ్యంలో భారత దేశంసర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనే ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+