విజ్డన్ పై అజర్‌కేసు!
న్యూఢిల్లీః క్రికెటర్లు బైబిల్ గా భావించేవిజ్డన్ సంస్థపై కేసు వేయాలని అజరుద్దీన్ యోచిస్తున్నాడు. కపిల్ దేవ్, లక్ష్మణ్ తదితరులకువిజ్డన్ సంస్థ ఇటీవల ఉత్తమ భారత క్రికెటర్ల అవార్డులను ప్రదానం చేసినవిషయం విదితమే. లండన్ లో జరిగిన ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడం పరోక్షంగా తనను అవమానించడమేనని అజర్ అభిప్రాయం. శతాబ్దపు ఉత్తమ భారత క్రికెటర్ అవార్డు నామినీలు 16 మందిలో అజర్‌పేరు కూడా వుంది.
అజరుద్దీన్ ఆ రోజను లండన్ లోనే వున్నప్పటికీ ఆయనను అవార్డుల ప్రదానోత్సవానికి ఆహ్వానించలేదు. నామినీల్లో కొందరు తన పై కక్ష కట్టి అవార్డుల ప్రదానోత్సవానికి వద్దని పుంటారని అజర్ అనుమానం వ్యక్తం చేశారు. తనను అవమానించినవిజ్డన్ పై చట్టపరంగా చర్య తీసుకొనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. అజర్ పై ఎటువంటి నిందలైనా రావచ్చు.... అతను ఎటువంటి వాడైనా కావచ్చు. దేశం కోసం రెండు దశాబ్దాల పాటు అహరహం కృషి చేసిన ఆటగాడ్ని ఈ విధంగా అవమానించండం మాత్రంఅసమంజసం.












Click it and Unblock the Notifications
