రచయిత ఎన్‌.ఆర్‌. నంది కన్నుమూత

హైదరాబాద్‌: ప్రముఖ సాహితీవేత్త ఎన్‌.ఆర్‌. నంది ఆదివారం హైదరాబాద్‌లోని ఆయనస్వగృహంలో కన్ను మూశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

కథ, నవల, నాటక ప్రక్రియల్లో ఎన్‌.ఆర్‌. నంది తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. 1933లో రాజమండ్రిలో జన్మించని నంది 1948లో రచయితగా కలం పట్టారు. దాదాపు 200 కథలు, 25 నవలలురాశారు. కొన్ని నాటకాలు, నాటికలు రాశారు. దాదాపు 20 సినిమాలకు రచయితగా పని చేశారు. సుడిగుండాలు, తాసిల్దారుగారి అమ్మాయి, నోము, పున్నమినాగు వంటి సినిమాలకుఆయన పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, నంది అవార్డులు ఆయనను వరించాయి.

ఎన్‌.ఆర్‌. నంది రాసిన మరో మొహెంజొదారో నాటకానిదివిశిష్టమైన స్థానం. ఈ నాటకం 19 బాషల్లోకి అనువాదమైంది. దేశంలో దాదాపు పదివేల ప్రదర్శనలకు నోచుకుంది. నైమిశారణ్యం, దృష్టి, సిగ్గు సిగ్గు, గుడ్‌బై భూదేవి గుడ్‌బై నవలలు ఆయనకు ఎంతోపేరు తెచ్చిపెట్టాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+