SRH Vs AP: తెలుగు ఫ్యాన్స్ మధ్య 'మ్యాప్' చిచ్చు. కావ్య పాపకు చురకలు!
ఐపీఎల్ 2026 సీజన్ సిక్సర్ల హోరుతో కాకుండా వివాదాల జోరుతో తెలుగు రాష్ట్రాల్లో హీట్ పెంచుతోంది. మొన్నటి వరకు కేవలం ఆటగాళ్ల ప్రదర్శనపైనే చర్చ సాగగా, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) యాజమాన్యం చేసిన ఒక చిన్న 'లేజర్' ప్రయోగం రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల మధ్య చిచ్చు రాజేసింది. "కావ్య పాప"గా అభిమానులు పిలుచుకునే కావ్య మారన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్‌కు దారితీస్తోంది.
ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదాల్లో టాప్ ప్లేస్‌కు చేరింది. మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ప్రదర్శించిన లేజర్ షో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. SRH లోగో పక్కన కేవలం 'తెలంగాణ మ్యాప్'ను మాత్రమే ప్రదర్శించడంపై ఏపీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

తెలంగాణ టీమా? తెలుగు టీమా?
రెండు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్లు దాటినా, ఐపీఎల్ విషయానికి వస్తే ఏపీ, తెలంగాణ అభిమానులందరూ సన్ రైజర్స్ తమ సొంత జట్టుగా భావిస్తారు. కానీ, తాజా లేజర్ షోలో కేవలం తెలంగాణ మ్యాప్ వేసి.. "SRH కేవలం తెలంగాణకే సొంతం" అనే సంకేతాన్ని ఇచ్చారని ఏపీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. "మేము గుండెల్లో పెట్టుకున్న జట్టు మమ్మల్ని ఇంతగా అవమానిస్తుందా?" అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ (X) లో #BoycottSRH అనే ట్యాగ్ వైరల్ అవుతోంది.
SRH's Laser show of Telangana state 🧡 pic.twitter.com/y7vfK9R5Yf
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) April 16, 2026
ఆర్సీబీకి షిఫ్ట్ అయిపోదామా?
ఈ వివాదం ఎంత ముదిరిందంటే.. "ఇకపై మాకు హైదరాబాద్ టీమ్‌తో సంబంధం లేదు.. మేము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కి సపోర్ట్ చేస్తాం" అంటూ ఏపీ అభిమానులు గట్టిగా సమాధానం ఇస్తున్నారు. అటు తెలంగాణ ఫ్యాన్స్ కూడా తగ్గడం లేదు. "ఏపీ వాళ్లు ఎలాగూ ఆర్సీబీ భక్తులే కదా.. వాళ్లకు మా 'కావ్య పాప' లేజర్ షోతో సరైన బుద్ధి చెప్పింది" అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఐపీఎల్ గ్రూపులు ఇప్పుడు ఏపీ వర్సెస్ తెలంగాణ వార్ జోన్‌లుగా మారిపోయాయి.
కావ్య పాపకు కొత్త తలనొప్పులు!
సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌కు ఈ సీజన్ అస్సలు కలిసి రావడం లేదు. రీసెంట్ గా పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకోవడంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఆ వివాదం చల్లారకముందే, ఇప్పుడు సొంత రాష్ట్రాల అభిమానుల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా లేజర్ షో వేయించారనే ఆరోపణలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. "టీమ్ బిజినెస్ పెంచుకోవాల్సింది పోయి.. ఇలా సగం మంది ఫ్యాన్స్‌ను దూరం చేసుకోవడం ఏంటి?" అంటూ విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారు. మొత్తానికి, ఒక్క లేజర్ షో సన్ రైజర్స్ బ్రాండ్ ఇమేజ్‌ను తెలుగు రాష్ట్రాల్లో డ్యామేజ్ చేసేలా కనిపిస్తోంది. మరి ఈ వివాదంపై SRH యాజమాన్యం ఏమైనా క్లారిటీ ఇస్తుందో.













Click it and Unblock the Notifications