Hardik Pandya: హార్ధిక్ కెప్టెన్సీకి గండం ? చేసింది చాలు.. ఇక రోహిత్ కు ఇచ్చేయ్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఒత్తిడి పెంచేస్తున్నాయి. గతంలో రోహిత్ శర్మ ఫామ్ లో ఉండగానే అతన్ని తప్పించి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని కట్టబెట్టింది. గుజరాత్ నుంచి ముంబైకి తీసుకొచ్చి మరీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన హార్ధిక్ పాండ్యా ఈ సీజన్ లో వ్యక్తిగతంగానూ, కెప్టెన్ గానూ విఫలమవుతున్నాడు. దీంతో అతన్ని తప్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఈ సీజన్ లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ గెలిచినా, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. నిన్న పంజాబ్ తో మ్యాచ్ లో అయితే కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యూహాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ ను తప్పించాలనే డిమాండ్లు మళ్లీ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌లో మాట్లాడిన భారత మాజీ బ్యాటర్ మనోజ్ తివారీ (manoj tiwary) పంజాబ్ పై హార్ధిక్ కెప్టెన్సీ తీరుపై మండిపడ్డాడు. ముంబై కెప్టెన్ అయినప్పటి నుంచి హార్ధిక్ ఆల్‌రౌండర్ నాయకత్వం ఆశించిన స్థాయిలో లేదన్నాడు.

Hardik Pandya Told to Quit IPL Captaincy for Rohit Sharma Injustice Done

యాజమాన్య స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి ఒక్కరూ తమను తాము సమీక్షించుకోవాలి. మీరు ఎలా ఆడుతున్నారో చూసుకోవాలి, నా అభిప్రాయం ప్రకారం, ఈ ఏడాది మీకు విజయం లభించలేదన్నంత మాత్రాన తప్పులు ఈ ఏడాదే జరిగాయని కాదు, మీరు మూల కారణాన్ని కూడా పరిశీలించాలి, 2015-2023 మధ్య, రోహిత్ శర్మ (Rohit Sharma) ముంబై ఇండియన్స్‌కు అనేక ట్రోఫీలు గెలవడంలో సహాయపడ్డాడని మనోజ్ తివారీ గుర్తుచేశాడు. ఈ నేపథ్యంల కెప్టెన్సీని వదులుకుని దానిని రోహిత్ శర్మకు తిరిగి అప్పగించాలని తివారీ హార్దిక్‌ను కోరాడు. కెప్టెన్సీ బలహీనంగా ఉందని, హార్దిక్ జట్టును నడిపించాల్సిన విధంగా నడిపించడం లేదన్నడు. కెప్టెన్‌గా ముందుచూపుతో వ్యవహరించడం చాలా ముఖ్యమని, ఒకవేళ పరిష్కారం అవసరమైతే, హార్దిక్ కెప్టెన్సీ నుండి తప్పుకుని ఆ బాధ్యతను తిరిగి రోహిత్‌కు అప్పగించాలని కోరాడు. రోహిత్ కు గతంలో అన్యాయం జరిగిందన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+