డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటే, తేల్చేసిన వైసీపీ..!!

డీలిమిటేషన్ బిల్లు పై వైసీపీ తమ వైఖరి తేల్చి చెప్పింది. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లుల పైన చర్చ జరుగుతోంది. వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి కేంద్రం ప్రతిపాదించిన బిల్లుల పైన స్పందించారు. బిల్లులకు మద్దతు పైన స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్షా లపైన రాజకీయంగా పై చేయి సాధించేందుకు డీలిమిటేషన్ ఆయుధంగా మారకూడదని సభా వేదికగా మిధున్ రెడ్డి స్పష్టం చేసారు. ఇదే సమయంలో కీలక అంశాలను ప్రస్తావించారు.

లోక్ సభలో జరుగుతున్న చర్చలో భాగంగా లోక్‌సభలో నియోజకవర్గాల పెంపు (డీలిమిటేషన్) , మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైసీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌పై ప్రభుత్వం చెబుతున్న అంశాలను లిఖితపూర్వకంగా బిల్లులో పొందుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాంతీయ అసమానతలు లేకుండా సమతుల్యంగా నియోజకవర్గాల పెంపు జరగాలని, అన్ని రాజకీయ పార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా ప్రక్రియ ఉండాలని సూచించారు. విపక్షాలను అణచివేసే విధంగా డీలిమిటేషన్ ఉండకూడదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఏపీలో జ‌గ‌న్‌ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలకు సంక్షేమ పథకాల అమలులో ప్రాధాన్యం కల్పిస్తూ, ఇళ్ల పట్టాలు మహిళల పేర్లతోనే అందించిన ఘనత కూడా జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.

 ఏపీలో కొత్త లోక్‌సభ స్థానాలు ఫిక్స్, లిస్టులో అమరావతి సహా ఇవే - ఈ సీట్ల రద్దు...!!
ఏపీలో కొత్త లోక్‌సభ స్థానాలు ఫిక్స్, లిస్టులో అమరావతి సహా ఇవే - ఈ సీట్ల రద్దు...!!
ysrcp-loksabha-floor-leader-mithun-reddy-announces-party-stand-over-women-reservations-delimitati

లోక్ సభలో తేల్చి చెప్పిన మిథున్ రెడ్డి

కాగా, ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మహిళలను వేధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. అసభ్యకర వీడియోలు బయటపడినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన మహిళలపైనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నప్పటికీ, తాము లేవనెత్తిన అన్ని అంశాలను పరిష్కరించాలని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ లో చర్చ తరువాత హోం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వనున్నారు. కాగా.. బిల్లుల కు సభలో లభించే ఆమోదం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. విపక్ష కూటమి నేతలు బిల్లుల విషయం లో ఏం చేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+