విదేశాలకు జగన్, సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ విదేశాలకు వెళ్లనున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి యూపర్ పర్యటనకు వెళ్లేందుకు జగన్ ప్రణాళికలు సిద్దం చేసారు. ఈ మేరకు కోర్టు అనుమతి కోరారు. తమ కుమార్తెల వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసారు. 15 రోజుల పాటు జగన్ యూరప్ పర్యటన కొనసాగనుంది. ఈ పిటీషన్ పైన విచారణ చేసిన సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కుటుంబంతో కలిసి యూరప్ దేశాల్లో పర్యటించేందుకు దాదాపు 25 రోజుల సమయం కావాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉండి, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నందున జగన్ విదేశాలకు వెళ్లాలంటే ప్రతిసారి కోర్టు అనుమతి తప్పనిసరి. ఆయన పాస్‌పోర్ట్ ప్రస్తుతం కోర్టు స్వాధీనంలోనే ఉంది. గతంలో జగన్ విదేశాలకు వెళ్లినప్పుడు అధికారులకు తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో సీబీఐ అధికారులు సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని, ఈమెయిల్స్‌కు కూడా స్పందించలేదని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ సమయంలో జగన్ తన పర్యటనను ముగించుకుని త్వరగానే ఇండియాకు రావడంతో కోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

పర్యటనకు అనుమతి.. షరతులు
కాగా, ఈసారి విదేశాలకు వెళ్లే ముందు తన అసలైన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ సమర్పించా లని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ కుమార్తెలు ఇద్దరూ లండన్‌లోనే ఉన్నత చదువులు పూర్తి చేసి, అక్కడే స్థిరపడ్డారు. గతంలో వారి గ్రాడ్యుయేషన్ డే కోసం కూడా జగన్ లండన్ వెళ్లి వచ్చారు. ఈ నెల 20 నుంచి మే 15 వరకు జగన్ లండన్.. యూరప్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోసం జగన్ రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని, పర్యటన ముగించుకుని వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. అధికారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్న ప్రధాన షరతుతో జగన్ విదేశీ ప్రయాణానికి మార్గం సుగమమైంది. దీంతో. .. జగన్ ఈ నెల 20న కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు.













Click it and Unblock the Notifications