బాత్‌రూం పక్కనే వంటగది, దేవుడి గది ఉండొచ్చా? వాస్తు ఏం చెబుతోంది?
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ పాత ఇంట్లో ఎదురైన ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కలవరపెడుతుంటాయి. అటువంటివి కొత్త ఇంట్లో రాకూడదని అందరూ కోరుకుంటారు. స్థలం చిన్నదైనా చాలు సొంత ఇల్లు కట్టుకుందామనుకుంటారు. అటువంటివారినిక ఒక సమస్య వేధిస్తుంటుంది. బాత్రూమ్ గోడను ఆనుకుని వంటగది లేదా దేవుడి గది ఉండొచ్చా? అన్న ప్రశ్నకు వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? అనేది చూద్దాం.
సాధారణంగా బాత్రూమ్ గోడకు దేవుడి గది లేదా వంటగది తగలకూడదంటారు.
కానీ వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం
ఒకసారి గదుల మధ్య గోడ ఏర్పడిన తర్వాత ఆ గది శక్తి మారిపోతుంది.
ఒక గదికి, మరో గదికి మధ్య గోడ ఉంటే, ఆ గోడ ఆ రెండు గదుల ప్రభావాలను వేరు చేస్తుంది.
కాబట్టి బాత్రూమ్ గోడకు ఆనించి దేవుడి గది లేదా వంటగది కట్టుకోవడం వల్ల
వాస్తు శాస్త్రపరంగా తీవ్రమైన దోషాలు ఉండవు.

స్థలం తక్కువగా ఉన్నప్పుడు బాత్రూమ్ పక్కనే దేవుడి గది వస్తే కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలి.
వీలైతే బాత్రూమ్ గోడకు, దేవుడి గది గోడకు మధ్య ఒక చిన్న అల్మారా
వచ్చేలా చూడాలి. దీనివల్ల నేరుగా గోడ తగలకుండా ఉంటుంది.
దేవుడి గదిని ఎప్పుడూ ప్రశాంతంగా, వెలుతురు వచ్చేలా ఉంచుకోండి.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇంటిని అమ్మేయడం ఎప్పుడూ మంచి నిర్ణయం అనిపించుకోదు.
ఒక్కోసారి వాస్తు దోషాల కంటే జాతక దోషాలు లేదా నడుస్తున్న దశ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు.
ఇల్లు మొత్తం పడగొట్టాల్సిన అవసరం లేదు.
కిటికీలు మార్చడం, రంగులు మార్చడం లేదా
నీటి నిల్వ ఉండే ప్రదేశాలను మార్చడం ద్వారా
పాత ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తొలగించవచ్చు.
ఒకసారి వాస్తు నిపుణుడిని సంప్రదించి,
మార్చలేని లోపాలు ఉంటేనే అమ్మకానికి వెళ్లడం తెలివైన పని.
సాధ్యమైనంత వరకు వంటగదిని ఆగ్నేయంలో,
బాత్రూమ్‌ను వాయువ్యం ఉండేలా ప్లాన్ చేయండి.
స్థలం ఎంత చిన్నదైనా సరే, ఈశాన్యం మూలను
ఖాళీగా లేదా తక్కువ బరువు ఉండేలా చూసుకోండి.
ఇక్కడ పూజ గది ఉండటం శ్రేయస్కరం.
చిన్న గదులు కాబట్టి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా
కిటికీలు ఏర్పాటు చేసుకోండి. సానుకూల శక్తి రావాలంటే వెలుతురు చాలా ముఖ్యం.












Click it and Unblock the Notifications