పాక్ కుట్ర భగ్నం చేస్తాంః ఫెర్నాండెజ్
న్యూఢిల్లీః కాశ్మీర్ ఎన్నికలను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలను భారత్ సమర్ధంగా తప్పికొడుతుందని భారత రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ వెల్లడించారు. కాశ్మీర్ ఎన్నికల నేపధ్యంలో అక్కడ హింసను ప్రేరేపించి, అల్లర్లు సృష్టించేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తే భారత్‌సేనలు చూస్తూ ఊరుకోవని ఆయన మంగళవారం దూరదర్శన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
కాశ్మీర్ లో ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడం వాజ్‌పేయి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఆయన చెప్పారు. సరిహద్దులో 20 నుంచి 30 శాతం వరకు చొరబాట్లు ఆగాయని అయితే అవి పూర్తిగా తగ్గలేదని ఫెర్నాండెజ్ చెప్పారు. అయితే భారత భూభాగలో మూడువేలమందికిపైగా టెర్రరిస్టులు తలదాచుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
