మైండ్ బ్లాకింగ్ హుక్ పాయింట్‌తో రాబోతున్న ఎమోషనల్ థ్రిల్లర్..!
తెలుగు చిత్రసీమలో థ్రిల్లర్ జోనర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కేవలం మైండ్ గేమ్‌లు, ట్విస్టులు మాత్రమే కాకుండా.. గుండెను తాకే ఎమోషన్‌ను జత చేసి సరికొత్త అనుభూతిని పంచేందుకు సిద్ధమైంది 'మిస్సింగ్ మేఘన' చిత్రం. ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించగా, వాచస్పతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న సుమారు 150కి పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సినిమాలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించగా.. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ , టైటిల్ రివీలింగ్ పోస్టర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ ఆవిష్కరించడంతోనే సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే సినిమాలోని పాటలకు విశేష స్పందన లభించడమే కాకుండా, ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ధృవన్ అందించిన బాణీలు శ్రోతలకు ఎంతో ఫ్రెష్‌నెస్ ఇస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. అలాగే, శ్యామ్ కె. నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

టీజర్ , పాటలతో ఆడియన్స్‌ను మెప్పించిన చిత్ర యూనిట్, త్వరలోనే పవర్ ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అవుట్‌పుట్ బాగా రావడం, ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా సంతృప్తికరంగా పూర్తి కావడంతో నిర్మాత నరేష్ బాబు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు.
సినిమా విశేషాలను దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో ఇప్పటివరకు చాలా థ్రిల్లర్ చిత్రాలు వచ్చాయి, ముందూ వస్తాయి. కానీ 'మిస్సింగ్ మేఘన' ప్రేక్షకులకు ఒక ఊహించని సర్ ప్రైజ్ ఇస్తుంది. ఏవో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, రెండేళ్ల కష్టాన్ని తూతూమంత్రంగా తెరపై చూపించే సినిమా ఇది కాదు. ముఖ్యంగా ఈ చిత్ర క్లైమాక్స్‌లో వచ్చే 'హుక్ పాయింట్' చూసి ప్రతీ ఒక్కరూ షాక్ అవుతారు. ఇది సాధారణ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక గొప్ప ఎమోషనల్ రైడ్ అని ధీమా వ్యక్తం చేశారు. అత్యంత ఆసక్తికరమైన కథాంశంతో, అద్భుతమైన నిర్మాణ విలువలతో వస్తున్న ఈ 'మిస్సింగ్ మేఘన' సెప్టెంబర్ 18న థియేటర్లలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.














Click it and Unblock the Notifications
