మంచు మనోజ్ 'వడ్డీ కాసులవాడ' లో గోవిందుడిగా స్టార్ హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది భైరవం, మిరాయ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు వడ్డీ కాసులవాడ అనే ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చేస్తున్నారు. తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్, ఏటీవీ ఒరిజినల్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ శ్రీ వెంకటేశ్వరస్వామి నేపథ్యంలో స్టోరీ ముందుకు సాగుతుంది. ఈ మూవీలో గోవిందుడిగా కోలీవుడ్ స్టార్ స్టార్ హీరో జయం రవి నటిస్తున్నారు. ఇవాళ ఆయన బర్త్ డే నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ మేరకు పోస్టర్ ను విడుదల చేసింది. ప్రతి హృదయంలో కొలువై ఉండే శ్రీ గోవిందుడి పాత్రలో ఆయనను చూడటం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని చిత్రబృందం తెలిపింది. "మా ప్రియమైన రవి మోహన్‌ కు హ్యాపీయెస్ట్ బర్త్‌డే" అని పోస్టు పెట్టింది.

అలాగే దివ్యమైన శ్రీ గోవిందుడి పాత్రలో 'వడ్డీ కాసులవాడ'చిత్రంలోకి మిమ్మల్ని ఆహ్వానించడం ఎంతో ఆశీర్వాదంగా భావిస్తున్నాం. ముందున్న ఈ ప్రయాణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.. అంటూ చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే ఆర్ట్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు.

JayamRavi is playing the role of Govinda in Manchu Manoj Vaddi Kasulavada The first look released

వడ్డీ కాసులవాడ చిత్రానికి కో-ప్రొడ్యూసర్లుగా దయా పన్నెం, అజయ్ సుంకర, కిషోర్ గరికపాటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో.. ఫుల్ లెంగ్త్ కామెండీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచు మనోజ్ బిందాస్ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇలాంటి ఎంటర్ టైనర్ తో రానున్న క్రమంలో ఈ మూవీ రిలీజ్ పై ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాగే మంచు మనోజ్ ఇతర సినిమాల్లోనూ నటిస్తున్నారు. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని మూవీలో కీలక పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. ఇక డేవిడ్ రెడ్డి అనే మూవీలోనూ మంచు మనోజ్ నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+