డిమాండ్ల క్యాసెట్‌ను పంపినవీరప్పన్
బెంగుళూర్: గంధం చెక్కల స్మగ్లర్‌వీరప్పన్ ఒక క్యాసెట్‌ను పంపాడు. మాజీ మంత్రి హెచ్. నాగప్పను విడుదల చేయడానికి ప్రభుత్వం నెరవేర్చాల్సిన తన డిమాండ్లను క్యాసెట్‌లో పొందుపరిచినట్లు సమాచారం.
నాగప్ప కిడ్నాప్ కర్ణాటక ప్రభుత్వ చర్య వల్లే జరిగిందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితవిమర్శించారు. వీరప్పన్‌ను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన కర్ణాటకస్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న ఐజి తెంబయ్యను అకస్మాత్తుగా బదిలీ చేయడం వల్లనేవీరప్పన్‌కు మాజీ మంత్రిని కిడ్నాప్ చేసే తెగువ, బలం వచ్చాయని ఆమె అన్నారు.
ఇదిలా ఉంటే, పోలీసు డైరెక్టర్ జనరల్ బి.పి నైల్వాల్ ముఖ్యమంత్రిని కలిసి కిడ్నాప్ వ్యవహారంపై చర్చించారు.వీరప్పన్‌ను పట్టుకునే చర్యలకు ఈ కిడ్నాప్ ఆటంకం కలిగిస్తుందని ఆయన అన్నారు. కిడ్నాప్‌విషయంలో తాను కర్ణాటక డిజిపితో మాట్లాడుతూనే ఉన్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
