వీరప్పన్‌తో చర్చలకే కర్ణాటక మొగ్గు
బెంగుళూర్: జనతాదళ్- యునైటెడ్ నేత హెచ్. నాగప్ప విడుదలకు సంప్రదింపుల మార్గాన్నే ఎంచుకుంటామని కర్ణాటక స్పష్టం చేసింది. అవసరమైతే మాత్రంవీరప్పన్ కోసం గాలింపు చేపట్టడానికి వెనుకాడబోమని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి డి.బి. చంద్రెగౌడ గురువారంవిలేకరులతో చెప్పారు.
నాగప్ప విడుదల కోసం ప్రభుత్వ అనుసరించే వ్యూహంపై కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణమాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఆయన గురువారం నాగప్ప బంధువులను కలుసుకున్నారు. నాగప్ప విడుదల కోసం ప్రభుత్వం అనుసరించే వ్యూహం గురించి ఈ సందర్భంగావిలేకరులు ప్రశ్నించినప్పుడు వేచి చూడండి అని మాత్రమే ఆయన అన్నారు. ఎస్‌టిఎఫ్ గాలింపు చర్యలు జరుగుతున్నాయా అని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన జవాబు ఇవ్వలేదు. చామరాజ్‌నగర్‌కు వెళ్లిమీరే చూడండి అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
