సుబ్రతోకు ఐసీసీఓకే!
న్యూయార్క్: కాశ్మీర్ పై అంతర్జాతీయ సమాజంముందు అవాకులు, చెవాకులు పేలిన పాక్ అధ్యక్షుడుముషారఫ్ కు ప్రధాని వాజ్ పేయి ధీటైన సమాధానం ఇస్తారని తెలిసింది. శుక్రవారం రాత్రిఆయన సర్వప్రతినిధి సభను ఉద్దేశించిప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో ముషారఫ్ వైఖరినిఎండగడుతారు. హిందూ తీవ్రవాదం, గుజరాత్‌ఊచకోత.. అంటూ భారతీయ అంతరంగిక సమస్యలనూ స్పృశించినముషారఫ్ కు సొంత ఇంటిని చక్కదిద్దుకోమని చెప్పేఅవకాశం ఉందని భారతీయ విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.
త్వరలో పాకిస్తాన్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల తీరును, బెనజీర్ భుట్టోనుఎన్నికల్లో పాల్గొనకుండా చేస్తోన్న వైనాన్ని, పాక్ ప్రేరేపిత తీవ్రవాదాన్నివాజ్ పేయి ఎండగడుతారు.ప్రసంగాలుమాని ప్రపంచానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోమనివాజ్ పేయి ముషారఫ్ కు ఘాటుగానే సూచిస్తారు.












Click it and Unblock the Notifications