వార్షిక బడ్జెట్‌లో మార్పులు: యనమల

విజయవాడ: రాష్ట్ర వార్షికబడ్జెట్‌లో అత్యవసరమైన మార్పులు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సోమవారంవిజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు.

వర్షాభావ పరిస్థితుల వల్ల నెలకొన్న కరువు దృష్ట్యా వార్షికబడ్జెట్‌లో మార్పులు చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. కరవు సహాయ చర్యలకు ప్రాధాన్యం ఇవ్వడానికి కేటాయింపుల్లో మార్పులు చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. కరవు వల్ల పన్నుల వసూళ్లు తగ్గాయని, కరవు వల్ల వ్యాపార, వాణిజ్యాలుదెబ్బ తిని పన్నుల వసూళ్లు తగ్గాయని ఆయన అన్నారు. ఇది రాష్ట్ర ఆదాయంపై ప్రభావం చూపుతుందని మంత్రి అన్నారు. ఈ ప్రభావంబడ్జెట్‌పై పడిందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని, వృత్తిపన్నును ఇక నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలు నేరుగా వసూలు చేసుకుని ఖర్చుపెట్టుకునేలా తగిన ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+