పాక్‌లో ఆరుగురు క్రిస్టియన్ల కాల్చివేత
కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీలో గల క్రిస్టియన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కార్యాలయంపై దుండుగులు దాడి చేసి ఆరుగురిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు.
ఆల్ ఖైదా, తాలిబాన్ అనుకూల సంస్థల ప్రతీకారచర్యల్లో భాగంగానే ఇది జరిగిందని క్రిస్టియన్‌రైట్స్ నేత షాబాజ్ భట్టి అన్నారు. మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వంవిఫలమైందని ఆయన అన్నారు. దాడులు ఇదే విధంగా కొనసాగితే తమ ప్రాణాల రక్షణకు, చర్చిల, సంస్థల, ఆస్తుల రక్షణకు అంతర్జాతీయ సమాజానికివిజ్ఞప్తి చేయాల్సి వుంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
