న్యూఢిల్లీ:గుజరాత్ ఘటన నేపథ్యంలో ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి తన నాలుగు రోజుల మాల్దీవుల పర్యటనను అర్థాంతరంగాముగించుకుని తిరిగి వస్తున్నారు. ఆయన నేరుగా గుజరాత్‌లోనిగాంధీనగర్ వెళ్తారు.
స్వామినారాయణ దేవాలయాన్ని ఆయన సందర్శిస్తారు.స్వామినారాయణ దేవాలయం ఘటనలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని ఆయన పరామర్శిస్తారు. మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్, భారత హై కమిషనర్ ఎస్.ఎం. గవాయ్‌ల నుంచి ఆయనసెలవు తీసుకున్నారు. అనంతరం ఆయన ఢిల్లీ వస్తారు.