విభేదాలు మీడియా సృష్టి: అద్వానీ

న్యూఢిల్లీ: సంఘ్‌ పరివార్‌కు, భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి మధ్య విభేదాలు మీడియా సృష్టేనని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ అన్నారు. బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వంపై సంఘ్‌ పరివార్‌ సంస్థలు తీవ్రవిమర్శలు చేస్తున్న నేపథ్యంలో అద్వానీ ఆ విధంగా అన్నారు.

ఇంతకు ముందు వాజ్‌పేయికి, అద్వానీకి మధ్య విభేదాలంటూ వార్తలు ప్రచురించిన పత్రికలు ఇప్పుడు ప్రభుత్వానికి, సంఘ్‌ పరివార్‌కు మధ్య విభేదాలున్నాయని రాస్తున్నాయని ఆయన అన్నారు. బిజెపి సంఘ్‌ పరివార్‌కు దూరమవుతున్న నేపథ్యంలో విభేదాల పరిష్కారానికి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ మీడియాపైవిమర్శలు చేశారు. బిజెపి సంకీర్ణానికి విశ్వహిందూ పరిషత్‌ నుంచి బెదిరింపులు వస్తున్నాయా అని ప్రశ్నిస్తే ఎవరూ బెదిరించడం లేదని, ఎవరూ బెదిరించలేరని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని అద్వానీ అన్నారు.

బిజెపి సిద్ధాంతానికి దూరమవుతోందని, కాంగ్రెస్‌ మాదిరిగాఅయిపోతుందని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. పార్టీ సిద్ధాంతం సాంస్కృతిక జాతీయవాదమని ఆయన స్పష్టం చేశారు. పరిపాలనలోని చాలా భాగాలకు సిద్ధాంతంతో పని లేదని ఆయన అన్నారు. ఎన్‌డిఎ ఉమ్మడి కార్యాచరణకు కట్టుబడి ప్రభుత్వం పని చేస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+