క్షమశిక్షణా రాహిత్యాన్నిసహించం: వెంకయ్య
హైదరాబాద్: కామన్‌వెల్త్ పార్లమెంటరీ నేతల 14వ సదస్సు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఉగ్రవాదంపై పోరుకు సన్నద్ధం కావాలని ప్రారంభసదస్సు పిలుపునిచ్చింది. ప్రపంచాన్ని పీడిస్తున్న ఉగ్రవాదంఅంతానికి, పేదరిక నిర్మూలనకు నడుం బిగించాలని అభిప్రాయపడింది. ప్రజలహక్కులు, పర్యవరణ పరిరక్షణ వంటిఅంశాలపై దృష్టి కేంద్రీకరించాలని అభిప్రాయపడింది.
దేశంలోని శాసనసభల పనితీరు పట్ల లోక్‌సభస్పీకర్ మనోహర్ జోషి అసంతృప్తి వ్యక్తం చేశారు.వీటి పనితీరు బాగా లేదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధికే శాసనసభ్యులు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అన్నారు.
ఈ నెల 27వ తేదీ వరకు జరిగే ఈ సదస్సులో 25 మంది కామన్‌వెల్త్ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. మొత్తం పదిఅంశాలపై సదస్సులో చర్చ జరుగుతుంది. మన దేశంలోనిసీనియర్ పార్లమెంటేరియన్లు కూడా కొన్ని అంశాలపై ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications
