ప్రధాని ఆరోగ్యంపై అనారోగ్య చర్చ
న్యూఢిల్లీ: ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం మరోసారి చర్చగా మారింది. తరుచుగా అనారోగ్యం పాలవుతున్న వాజ్‌పేయి ప్రధానిగా కొనసాగడంపై గత కొద్ది నెలలుగా జరుగుతోన్న చర్చ ఇప్పుడు మరింత ఊపందుకొంది. ఆదివారం గొంతునొప్పి తీవ్రం కావడంతో వాజ్‌పేయి విశ్రాంతిలో ఉన్నారు. ఎన్నో ముఖ్యమైన సమావేశాలు ప్రధాని అనారోగ్యం వల్ల వాయిదాపడ్డాయి.
న్యూఢిల్లీలో ప్రస్తుతం వాడివేడిగా జరుగుతోన్న చర్చలోఆరెస్సెస్, విఎచ్ పికి చెందిన నేతలు కూడా ఉండడంవిశేషం. అద్వానీని ప్రధాని పదవి కట్టబెట్టేందుకు ఇలాంటి అనారోగ్య చర్చ జరుగుతోందని ప్రధాని సన్నిహిత వర్గాలు ఆరోపిస్తున్నాయి.
వాజ్ పేయి సార్క్ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నవిషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈసారి సార్క్ సమావేశాలు పాకిస్థాన్ లో జరగనున్నాయి.












Click it and Unblock the Notifications
