వై.ఎస్‌.పై వాయలర్‌ ప్రశంసలు

విశాఖపట్నం: రాష్ట్ర కాంగ్రెస్‌ లో కొత్త ఉత్సహం నెలకొంది. నెలరోజులుగా రాష్ట్ర కాంగ్రెస్‌ చేపట్టిన పలు కార్యక్రమాలు విజయవంతం కావడంతో నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ మళ్ళీ ఆశలు చిగురుస్తున్నాయి. ఎనిమిది జిల్లాల్లో వై.ఎస్‌.యాత్రలతో మొదలైన కాంగ్రెస్‌ నిరసన కార్యక్రమాలు వాయలర్‌ రవి రాష్ట్ర పర్యటనతో తారాస్థాయికి చేరుకున్నాయి.

ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ టైం ఉన్నప్పటికీ, వై.ఎస్‌. ముందు చూపుతో కాంగ్రెస్‌ లో ఒక కొత్త చైతన్యం వచ్చేలా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడాని ఏ.ఐ.సి.సి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జి వాయలర్‌ రవి అన్నారు.

ఆయన వై.ఎస్‌.ను ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించిన వాయలర్‌ రవి శనివారం తన పర్యటనను ముగించుకున్నారు. ఎక్కడా చూసిన కాంగ్రెస్‌ లో ఐక్యత పెరిగిన ఛాయలే కనపడుతున్నాయని ఆయన వివారించారు. వాయలర్‌ పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ నిర్వహించిన రెండు బహిరంగ సభలు విజయవంతమయ్యాయి.

నిజమాబాద్‌ లో ఏర్పాటు చేసిన సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శుక్రవారం విజయనగరంలో చేపట్టిన ర్యాలీకి కూడా మంచి స్పందన లభించింది. క్రితం సారి పర్యటనకు వచ్చినప్పుడు వాయలర్‌ రవికి ఏయిర్‌ పోర్ట్‌ లోనే అసమ్మతినేతలు ఘన స్వాగతం పలికారు. అయతే, ఈసారి పీసీ అధ్యక్షుడు ఎమ్మెస్సార్‌ పకడ్బందీగా అసమ్మతి నేతలు వాయలర్‌ దరిదాపుల్లోకి రాకుండా చూశారు.

ఈ పర్యటన నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. కాంగ్రెస్‌ ఈ సారి ఎన్నికల్లో గెలవడం తథ్యం. పార్టీలో చిన్న చిన్న విభేదాలున్నా, మీడియా సృష్టిస్తున్నంతగా భయపడాల్సిన అవసరం లేదు. వై.ఎస్‌, ఎమ్మెస్‌ లిద్దరూ కలిసి పనిచేసి పార్టీ పనితీరును మెరుగుపర్చారని వాయలర్‌ రవి విలేకరులకు తన అభిప్రాయాలను తెలిపారు.

మొత్తమ్మీద కాంగ్రెస్‌ టీడీపీని ఇబ్బంది పెట్టడంలో ప్రస్తుతానికి సపలీకృతమైంది. కానీ కాంగ్రెస్‌ లో ఎప్పుడు అసమ్మతి వర్గీయులు చిచ్చుపెడుతారో చెప్పలేం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+