పాక్ తో భారత్ చర్చలు జరపాలి
వాషింగ్టన్: పాకిస్థాన్ తో భారతదేశం తిరిగి చర్చలు ప్రారంభించాలని అమెరికా సూచించింది. భారత్ లోకి చొరబాట్లు తగ్గుముఖం పట్టినందున, చర్చలకు ఇదే తగిన సమయమని అమెరికా ప్రభుత్వపు దక్షిణాసియా వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి క్రిస్టియానా రోకా అన్నారు.
ఇప్పటికీ కొన్ని చొరబాట్లు జరుగుతున్నా, ముషారప్ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని మేం భావిస్తున్నామని ఆమె అభిప్రాయపడ్డారు. ఇరు పక్షాలు కూడా సరిహద్దు వెంబడి దళాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం ముదాహవమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
