బడ్జెట్‌లో జన్మభూమి సమస్యలు: బాబు
హైదరాబాద్: బడ్జెట్ రూపకల్పనలో జన్మభూమి సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. బడ్జెట్ రూపకల్పనపై ఆయన శుక్రవారం ఉన్నతాధికారుతో, వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో చర్చలు జరిపారు.
ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయింపులు జరిపాలని ఆయన అన్నారు. జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించే విధంగా కేటాయింపులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 2003-2004 బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కసరత్తు వచ్చే నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. ప్రభుత్వ శాఖ పనితీరు ఆధారంగా కేటాయింపులు జరిపే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అభివృద్ధి సూచికల ఆధారంగా వివిధ శాఖల పనితీరును ప్రభుత్వం అంచనా వేసింది.












Click it and Unblock the Notifications