ఎన్టీఆర్‌ వల్లనే ఇంత ఖ్యాతిః చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 31-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌ః నందమూరితారకరామారావు వల్లనే తెలుగు వారికి అంతర్జాతీయ కీర్తి లభించిందని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన తెలుగు ఆత్మగౌరవ పురస్కారప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. స్వాతంత్ర్యసంగ్రామం, తదితర ఉద్యమాల్లో తెలుగు ప్రముఖులు కీలక పాత్రవహించినప్పటికీ తెలుగువారికి ఖ్యాతి ఎన్టీఆర్‌వల్లే వచ్చిందని ఆయన అన్నారు.

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన తెలుగు ప్రముఖులను ముఖ్యమంత్రిసన్మానించారు. సాహిత్య రంగంలో కొత్తపల్లివీరభద్రరావు, లలిత కళల్లో నటరాజరామకృష్ణ, అంజలీదేవి, సామాజిక సేవారంగంలోమల్లాది సుబ్బమ్మ, క్రీడా రంగంలో ముఖేష్‌ కుమార్‌ పురస్కారాలుఅందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సమాచార శాఖ డైరెక్టర్‌ బాలసుబ్రమణ్యంఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్‌ మీడియా కో ఆర్డినేటర్‌ ఊటుకూరుసుభాష్‌ నిర్వహించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X