చత్తిస్‌ గడ్‌లో 55 సీట్లకు బిఎస్పీ పోటీ

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 31-10-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

రాయపూర్‌ఃచత్తిస్‌ గడ్‌ అసెంబ్లీఎన్నికల్లో 55 అసెంబ్లీ స్ధానాలకు పోటీ చేయాలనిబహుజన్‌ సమాజ్‌ పార్టీ నిర్ణయించింది. డిసెంబర్‌ ఒకటినచత్తీస్‌ గడ్‌ లోని 90 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికలుజరుగనున్నాయి. అయితే ముఖ్యమంత్రి అజిత్‌జోగిపై తమ అబ్యర్ధిని నిలబెట్టడంలేదని బిఎస్పీ తెలిపింది.

అన్ని అసెంబ్లీ స్ధానాలకు పోటీచేయాలని అనుకున్నామని, పార్టీ అధ్యక్షురాలుమాయావతిపై సిబిఐ దాడులు తదితర కారణాలవల్ల వ్యూహం మార్చుకున్నామని బిఎస్పీ జాతీయ ప్రధానకార్యదర్శి నరేంద్ర కాస్యప్‌ రాయపూర్‌ లోప్రకటించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాకుండాచూడడమే తమ పార్టీ వ్యూహమని ఆయనచెప్పారు. కాంగ్రెస్‌ తో తమకు రహస్య అవగాహనఉందన్న వార్తలను ఆయన ఖండించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X