ముఠాలు కట్టడం మానాలి: ఆజాద్‌

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 03-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

రాజమండ్రి: ఈ సారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే ముందుగా పార్టీనేతలు ముఠాలు కట్టడం మానుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ ఛార్జీ గులాం నబీ ఆజాద్‌ పిలుపునిచ్చారు.

వర్గాలు, ముఠాలు కట్టే నేతలను చూస్తూ ఊర్కోబోమని ఆయన పార్టీ నాయకులను హెచ్చరించారు. సోమవారం రాజమండ్రిలో ప్రజాహిత యాత్రను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో స్పందన వ్యక్తమవుతోంది.

ఈ సారి కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కర్ణాటకలో అమలుపర్చినట్లుగానే, రాష్ట్రంలోని ప్రజలవద్దకే కాంగ్రెస్‌ నాయకులు వెళ్లే కార్యక్రమాన్ని మరింత విస్తృతపరుస్తామన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి