Home

Posted on 03-11-03

మళ్ళీ కివీస్‌ ఓటమి, ఆసీస్‌ జోరు

పూణ: సోమవారం ఆసీస్‌, కివీస్‌ ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ లో అనూహ్యంగా ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరి ఓవరు వరకు ఆధిపత్యం వహించిన కివీస్‌ ఆఖరి మూడు బంతుల్లో ఆటను ఆసీస్‌ కు అప్పగించింది. టీవీఎస్‌ కప్‌ ముక్కోణపు టోర్నీలో కివీస్‌ ఇంటిదారి పట్టింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌ లో ఆసీస్‌ జట్టు మరోసారి తన ప్రోఫెషనిలిజాన్ని ప్రదర్శిస్తూ, వన్డే మ్యాచ్‌ లో తమకు తిరుగులేదని నిరూపించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ 259 పరుగులు చేసింది. లక్ష్యాన్ని చేధించే ప్రయత్నంలో ఆసీస్‌ ధాటిగా ఆడడం ప్రారంభించింది. మరోసారి ఆడమ్‌ గిల్‌ క్రిస్ట్‌ వస్తూనే..బంతిని పరుగులెత్తించాడు. అంతే వేగంగా ఆయన పెవిలియన్‌ ముఖం పట్టాడు. 54 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్‌ ను కివీస్‌ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఆస్ట్రేలియా చివరికంటా పోరాడింది. చివరి ఓవర్లో ఆండ్రూ సైమండ్స్‌ ధాటిగా ఆడి కివీస్‌ ను ఓడించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+