Home

Posted on 03-11-03

32 మంది నక్సల్స్‌ లొంగుబాటు

హైదరాబాద్‌: వివిధ నక్సల్స్‌ గ్రూప్‌ లకు చెందిన 32 మంది నక్సలైట్లు సోమవారం డీజీపీ సుకుమార ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు కమాండెర్‌ నేతలు కూడా ఉన్నారు. అయితే, ఈ లొంగుబాటుపై రెండు రకాల అభిప్రాయాలు వెలువడడం విశేషం. లొంగిపోయిన నక్సలైట్లు తాము ఇంతకుముందే ఆయా జిల్లా పోలీసు యంత్రాంగం ఎదుట సరెండర్‌ అయినట్లు ప్రకటించగా, డీజీపీ వారి వాదనను కొట్టిపారేశారు.

వారు లొంగిపోవడం ఇదే ప్రథమం అంటూ ప్రకటించడంతో..వార్‌ పై పైచేయి సాధించే ప్రయత్నంలో భాగంగా ఈ లొంగుబాటు జరిగినట్లు కన్పిస్తోంది. నక్సల్స్‌ సిద్దాంతాలపై వెగటు, అనారోగ్యం, జనజీవన స్రవంతిలోకి రావాలన్న ఆలోచనవంటి తదితర కారణాల వల్ల జనశక్తి, ప్రజాప్రతిఘటన, పీపుల్స్‌ వార్‌ కు చెందిన 32 మంది నక్సల్స్‌ లొంగిపోయారని డీజీపీ విలేకరులకు తెలిపారు. వీరికి పునరావసం కల్పిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+