Home
Posted on 03-11-03
హైదరాబాద్: సీనియర్ పోలీసు అధికారి, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడెమీలో డిఐజీగా పనిచేస్తోన్న ఎం.శ్రీనివాసులు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజకీయ ప్రవేశంపై కొంతకాలంగా ఊహాగానాలు రేగుతున్నాయి.
మహబూబ్ నగర్ కు చెందిన ఎం.శ్రీనివాసులు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాను కలుసుకొని తన అభిమతాన్ని తెలియచేశారు. అనంతరం నేరుగా డీజీపి సుకుమార కార్యాలయానికి వెళ్ళి ఆయనకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆయన కృషి చేయనున్నారు. అయితే, ఆయన టీఆర్ ఎస్ లో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వంలో ఉంటూ తాను ఎలాంటి అభిప్రాయం వెల్లడించలేనన్నారు. ఆ వార్తలనూ ఆయన ఖండించారు.












Click it and Unblock the Notifications
