Home
Posted on 04-11-03
వరంగల్: పాల కల్తీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వరంగల్ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. పాలను కల్తీ వ్యవహారాన్ని పకడ్బందీగా నడుపుతున్న ఈ ఇద్దరు వ్యక్తుల అరెస్టుతో మరింత మంది బయటకు రాగలరని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం-ఆ ఇద్దరు వ్యక్తులు పేరున్న పాల ప్యాకెట్లను తెలివిగా కత్తిరించి వాటిలోని కొన్ని పాలను తీసి, నీళ్లతో నింపడం, వాటి నుంచి తీసిన పాలను ఖాళీ ప్యాకెట్లలో నింపి వాటిని విక్రయించడం చేస్తూ వస్తున్నారు. అరెస్టయిన వ్యక్తుల్లో ఒకరు రమేష్ కాగా, మరో వ్యక్తి బ్యాంక్ ఉద్యోగి శివశంకర్. ఈ అక్రమాలను శివశంకర్ కొంత మంది వర్కర్లను నియమించుకుని కొనసాగిస్తున్నాడు. కల్తీరాయుళ్ల వర్కర్ల మధ్య గొడవతో ఈ గుట్టు రట్టయింది.












Click it and Unblock the Notifications
