Home
Posted on 04-11-03
హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్‌లు వేసింది. కూపన్ల ద్వారా సబ్సిడీ బియ్యం పంపిణీని చేపట్టాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి వర్గ ఉపసంఘంతో వెలుగు సర్వేపై మంగళవారం చర్చలు జరిపిన అనంతరం ఆ నిర్ణయం తీసుకున్నారు. వెలుగు సర్వేలో లోపాలు బయటపడడంతో కార్డుల పంపిణీని ఆపేయాలని ఆయన ఆదేశించారు. ఈ నిర్ణయంతో 25 లక్షల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆగిపోతుంది. వారం రోజుల లోగా రేషన్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి అంతకు ముందు ఆదేశాలు ఇచ్చారు.
లోపాలను సరిదిద్ది రేపటిలోగా నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా చెప్పారు. రేషన్ కార్డుల జారీకి స్వస్తి చెప్పబోమని పౌరసరఫరాల మంత్రి ముత్యం రెడ్డి సమావేశానంతరం విలేకరులతో అన్నారు. నిరుపేదలకు తెల్లరేషన్ కార్డులు అందజేయాలనేదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
