Home
Posted on 04-11-03
కాకినాడ: కాంగ్రెస్ విభేదాలు లేవని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజాహిత బస్సు యాత్ర మంగళవారం ఉదయం కాకినాడ నుంచి బయలుదేరి రామచంద్రాపురం చేరుకుంది. ఇక్కడి బహిరంగ సభలో శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రసంగించారు.
ప్రజా క్షేమం కోసం తమ పార్టీ నాయకులందరూ కలిసి పని చేస్తారని చాటి చెప్పడానికే బస్సు యాత్రను తలపెట్టామని శ్రీనివాస్ చెప్పారు. తమ యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీద శ్రీనివాస్‌తో పాటు రాజశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications
