Home
Posted on 04-11-03
కొలంబో: శ్రీలంకలో రాజకీయ సంక్షోభం చోటు చేసుకుంది. శ్రీలంక అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ ముగ్గురు మంత్రులను తొలగించడంతో ఈ సంక్షోభం తలెత్తింది. తన ప్రధాన ప్రత్యర్థి అయిన ప్రధాని రనిల్ విక్రమసింఘే అమెరికా పర్యటనలో ఉన్న ప్రస్తుత తరుణంలో చంద్రికా కుమారతుంగ ఈ తీవ్ర చర్యకు పూనుకున్నారు.
విక్రమ్ సింఘే ప్రారంభించిన శాంతి ప్రక్రియను చంద్రికా కుమారతుంగ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రక్షణ మంత్రి తిలక్ మరపన, ఆంతరింగిక మంత్రి జాన్ అమరతుంగ, సమాచార మంత్రి ఇంతియాజ్ బకీర్ మార్కర్‌లను డిస్మిస్ చేయడంతో పాటు ఈ ముగ్గురు మంత్రుల రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు సహకరిస్తున్న అధికారులను కూడా చంద్రికా కుమారతుంగ తొలగించారు. కొంత కాలం పాటు పార్లమెంటును కూడా చంద్రికా కుమారతుంగ సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications
