Home
Posted on 04-11-03
హైదరాబాద్: కరువు సహాయక చర్యలకు రాష్ట్రానికి 953 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంది. కేంద్ర బృందం ప్రతినిధులు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు.
కరువు వల్ల రాష్ట్రంలో 944 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర అధికారులు కేంద్ర బృందానికి తెలియజేశారు. ఈ మేరకు కేంద్ర బృందానికి ఒక నివేదిక సమర్పించారు. బుధవారం నుంచి ఈ బృందం నాలుగు జిల్లాల్లో పర్యటిస్తుంది. కరువు సహాయక చర్యల కింద రాష్ట్ర ప్రభుత్వం 198 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని రాష్ట్ర అధికారులు కేంద్ర బృందానికి చెప్పింది. ఖర్చుల వివరాలను కూడా వారు వివరించారు. వరి దిగుబడి 25 లక్షల టన్నుల మేరకు తగ్గిందని, వేరుశనగ దిగుబడి 50 శాతం తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర బృందానికి చెప్పారు. కేంద్ర బృందం రెండు జట్లుగా విడిపోయి బుధవారం అనంతపురం, మెదక్ జిల్లాలకు వెళ్తాయి.












Click it and Unblock the Notifications
