శ్రీలంకలో అత్యవసర పరిస్థితి
Posted on 05-11-03
కొలంబో: శ్రీలంక అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగ బుధవారం దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. ముగ్గురు కీలకమైన మంత్రులను తొలగించిన 26 గంటల లోపే చంద్రికా కుమారతుంగ దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు వల్లసైన్యానికి అపరిమితమైన అధికారాలు సంక్రమిస్తాయి. తన విచక్షణాధికారులను వినియోగించి కుమారతుంగ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. దీని వల్ల అనుమానితులనుఅరెస్టు చేసే, నిర్బంధించే అధికారాలు సైన్యానికి సంక్రమిస్తాయి. ఈ అసాధారణ పరిస్థితి పది రోజుల పాటు అమలులో వుంటుంది. మరిన్ని రోజులు దీన్ని పొడగించాలంటే పార్లమెంటు ఆమోదం పొందాల్సి వుంటుంది.












Click it and Unblock the Notifications