Home
Posted on 05-11-03
న్యూజెర్సీః ప్రవాసాధ్రుడు ఉపేంద్ర చివుకుల న్యూజెర్సీ అసెంబ్లీకి తిరిగి ఎన్నికయ్యారు. ఆయన డెమోక్రాట్ అభ్యర్ధిగా న్యూజెర్సీ 17వ జిల్లా నుంచి విజయం సాధించారు. ఇప్పటి వరకు లెక్కించిన 10,282 ఓట్లలో 28.95 శాతం ఉపేంద్రకు వచ్చాయి.
ఇంకా మరికొన్ని ప్రాంతాల నుంచి ఓట్ల వివరాలు అందవలసి ఉంది. న్యూజెర్సీ అసెంబ్లీకి ఎన్నికైన మొదటి ప్రవాస భారతీయుడు ఉపేంద్ర. ఈ ఎన్నికల్లో కూడా తనకు మద్దతు ఇచ్చిన ప్రవాస భారతీయులకు ఉపేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఉపేంద్ర చివుకుల అమెరికాలోని తెలుగు వారికి చిరపరిచితులు. తెలుగువారు చేపట్టిన అనేక సామాజిక సేవాకార్యక్రమాలకు ఆయన మద్దతు ఇచ్చారు.












Click it and Unblock the Notifications