Home
Posted on 06-11-03
విశాఖపట్నం: తెలుగుదేశాన్ని బహిష్కరించాలని పీపుల్ వార్ గ్రూప్ ఇచ్చిన పిలుపునకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలుగుదేశం పార్టీకిగానీ, పార్టీనాయకులకు గానీ నక్సలైట్లపై వ్యక్తిగత క్షక్ష గానీ, విరోధంగానీ లేదని స్పష్టం చేశారు. ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మాత్రమే తాము చెపుతున్నామన్నారు. ఇటీవల నల్గొండ జిల్లా వార్ కమిటీ కార్యదర్శి నవీన్ తదితరులు కొన్ని పత్రికలకు చెందిన విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి...తెలుగుదేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
దీనిపై గురువారం ముఖ్యమంత్రి విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ..వార్ ఇలాంటి పిలుపులు ఇస్తూనే ఉంది. కానీ ప్రజలు నక్సల్స్ కు వ్యతిరేకంగా ఉన్నారని విషయం తెలుసుకోవాలని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండు భారీ సాగునీటి ప్రాజెక్టలకు శంకుస్థాపన చేసేందుకు ఆయన బయలుదేరి వెళ్ళేముందు విలేకరులతో మాట్లాడారు.
గద్దరు, వరవరరావులను హత్య చేసేందుకు పోలీసులు, ప్రభుత్వం కుట్ర పన్నుతున్నారని వార్ చేసిన ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. కావాలంటే వారికి రక్షణ కావాలంటే కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
