Home

Posted By:
Subscribe to Oneindia Telugu

Posted on 06-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

28 మంది సజీవదహనం

కోల్‌కత్తా/ లక్నో: రెండు వేర్వేరు సంఘటనల్లో మొత్తం 28 మంది సజీవ దహనమయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సంఘటనలో 21 మంది సజీవదహనం కాగా, ఉత్తరప్రదేశ్‌ సంఘటనలో ఏడుగురు సజీవదహనమయ్యారు.

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లా దాల్‌గావ్‌లో గల ఒక టీ గార్డెన్‌లో గల ఇంటిని గురువారం ఉదయం గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. దీంతో ఇంటిలో గల 21 మంది సజీవ దహనమయ్యారు. మరణించినవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఇల్లు టి. లోహర్‌ అనే వ్యక్తికి చెందిందని పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (శాంతిభద్రతలు) చయన్‌ ముఖర్జీ చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవ్‌ జిల్లాలోని ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గిరిజనులను మరో కులానికి చెందినవారు సజీవ దహనం చేశారు. ఫతేపూర్‌ చౌరాసి గ్రామంలో గిరిజన తెగకు చెందిన కంజార్‌ కులానికి చెందిన కుటుంబ సభ్యుల ఇంటికి దళితుల సమూహం ఒకటి నిప్పంటించింది. పది మంది దళితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి