Home

Posted on 06-11-03

అండర్‌-19 టోర్నీ విజేత భారత్‌

లాహోర్‌: నాలుగుదేశాల అండర్‌ -19 క్రికెట్‌ టోర్నమెంట్‌ను భారత్‌ గెలుచుకుంది. గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా భారత్‌ ఈ టోర్నీని సాధించింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక జట్టు 49.4 ఓవర్లలో 225 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రాకేశ్‌ సోలంకి, కెప్టెన్‌ అంబటి రాయుడు అర్థ సెంచరీలు సాధించి విజయాన్ని అందుకున్నారు. 86 బంతుల్లో 88 పరుగులు చేసిన రాబిన్‌ ఉతప్ప మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మరోసారి భారత బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తన సత్తా చూపాడు. 33 పరుగులు ఇచ్చి మూడు ప్రధాన వికెట్లను పడగొట్టాడు. పఠాన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌, శ్రీలంక, భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లు పాల్గొన్నాయి. 1988 తర్వాత పాకిస్థాన్‌కు తొలి భారత పర్యటన ఇదే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+