Home
Posted on 06-11-03
హైదరాబాద్: హైదరాబాద్‌లోని దోమలగుడాలో గల నాగార్జున ఫైనాన్స్ కార్యాలయం ఎదుట డిపాజిటర్లు గురువారం ధర్నా చేశారు. తమ సొమ్ములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ధర్నా నిర్వహించారు.
నాగార్జున ఫైనాన్స్ చాలా రోజుల క్రితమే మూతపడింది. ఈ సంస్థ డైరెక్టర్లు 9 మంది పరారీలో ఉండగా, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని డిపాజిటర్లు అంటున్నారు. కేసు హైకోర్టు పరిశీలనలో ఉన్నందున తాము ఏమీ చేయలేమని అధికారులంటున్నారు. దాదాపు 35 వేల మంది ఈ సంస్థలో కోట్లాది రూపాయలు డిపాజిట్ చేశారు.












Click it and Unblock the Notifications
