Home
Posted on 06-11-03
భీమవరం: సర్వేలు నిర్వహించి వాటి ఆధారంగా గెలిచే అభ్యర్థులకే వచ్చే శాసనసభ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. సొంత సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామని ఆయన గురువారం అంతర్వేదిలో విలేకరులతో చెప్పారు.
టికెట్ల కోసం పోటీలో ఎక్కువ మంది ఉన్నప్పటికీ తమ సర్వే ఫలితాలే అభ్యర్థుల నిర్ణయానికి కీలకమవుతాయని ఆయన చెప్పారు. బలప్రదర్శన ద్వారా టికెట్లు లభిస్తాయనుకోవడం సరి కాదని ఆయన చెప్పారు. టికెట్లు లభించనివారికి తగిన స్థానాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. తిరుగుబాటు అభ్యర్థుల బెడదను నివారించడానికి ఆయన ఈ విషయం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అయినా స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తామని ఆయన చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉచిత విద్యుత్ హామీ కీలక పాత్ర వహిస్తుందని ఆయన అన్నారు. బస్సు యాత్రను మరో పది రోజులు పొడిగించనున్నట్లు ఆయన తెలిపారు.
తమ ప్రజాహిత బస్సు యాత్ర అపూర్వ రీతిలో సాగుతోందని కాంగ్రెస్ నాయకులన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ముందుకు రావాలని వారు గురువారం బహిరంగ సభల్లో ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు లభిస్తున్న ఆదరణ తెలుగుదేశం పాలన అంతానికి పనికి వస్తుందని ఆయన అన్నారు. ఈ బహిరంగ సభల్లో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, సిఎల్‌పి నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి పి. శివశంకర్ గురువారం బస్సు యాత్రలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
