Home
Posted on 06-11-03
కరీంనగర్: కరువుకు ఎక్కువ శాతం రైతులే కారణమని కేంద్ర కరవు బృందం ప్రతినిధులు అన్నారు. వారు గురువారం కరీంనగర్ జిల్లాలోని రెండు గ్రామాలను సందర్శించారు. అనంతరం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన స్లైడ్ షోను తిలకించారు.
వర్షాభావం, రైతుల నిర్లక్ష్యం, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోకపోవడం కరువు పరిస్థితులకు కారణమని వారన్నారు. శనిగరం, తదితర గ్రామాల్లోని రిజర్వాయర్‌ను, చెరువులను, కుంటలను వారు చూశారు. అవన్నీ ఎండిపోయి ఉండడాన్ని వారు గమనించారు. రైతులతో మాట్లాడారు. వర్షాభావం గురించి ప్రభుత్వం ముందే హెచ్చరించినప్పటికీ రైతులు పట్టించుకుని తగిన విధంగా వ్యవహరించలేదని, ఎర్రమట్టి నేలలో పత్తి వేయకూడదని చెప్పినప్పటికీ వేశారని, అందువల్ల కరువు పరిస్థితులకు రైతుల నిర్లక్ష్యం కారణమని వారన్నారు.
అయితే కరువు పరిశీలన బృందం పర్యటన నామమాత్రంగా సాగిందని రాజకీయ పార్టీల నాయకులు విమర్శించారు. జిల్లాలో 41 మండలాలు కరువుకు గురైతే బృందం ప్రతినిధులు రెండు గ్రామాలనే సందర్శించారని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications
