Home
Posted on 07-11-03
హైదరాబాద్: రైతు సమస్యలపై కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజాహిత బస్సు యాత్ర శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి బయలుదేరి తాడేపల్లి గూడెం చేరుకుంది.
వంద శాతం కొనుగోలుకు అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ రైతాంగ విధానాలను, సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను కాంగ్రెస్ నాయకులు తప్పు పట్టారు. రైతులు భరించే స్థితిలో వడ్డీరేట్లు లేవని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ప్రజలను వంచిస్తున్నారని, శంకుస్థాపనలు చేస్తున్నారనే తప్ప వాటిని పూర్తి చేయడం లేదని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నాయకుడు డాక్టర్ వై.యస్. రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలను ఆశపెట్టి మోసం చేయడం చంద్రబాబుకు పరిపాటేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
