Home
Posted on 07-11-03
హైదరాబాద్: కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. నక్సలైట్ల దాడిలో గాయపడిన చంద్రబాబును ప్రముఖ కన్నడ సినీ నటుడు రాజ్‌కుమార్ దంపతులు పరామర్శించారు.
రాజ్‌కుమార్ దంపతులకు చంద్రబాబు విందు ఇచ్చారు. ప్రముఖ సినీనటుడు ఎన్.టి. రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తనకు చంద్రబాబుతో మంచి పరిచయం ఉన్నదని రాజ్‌కుమార్ విలేకరులతో చెప్పారు. చంద్రబాబు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని ఆయన అన్నారు. భగవంతుడు చంద్రబాబుకు, చంద్రబాబు భగవంతునికి కావాలని, భగవంతుని కృప వల్లనే చంద్రబాబు ప్రమాదం నుంచి బయటపడ్డారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
