Home
Posted on 07-11-03
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఎపిసిఎల్‌సి) రాష్ట్ర అధ్యక్షుడు జి. లక్ష్మణ్ క్షేమంగా తిరిగి వచ్చారు. ఆయన శుక్రవారం మధ్యాహ్నం గం.2.45 నిమిషాలకు తన ఇంటికి చేరుకున్నారు. ఆయనను గురువారం రాత్రి తిరుమల టైగర్స్ పేరిట కొంత మంది కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆయన ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం విలేకరులతో చెప్పారు. తాను దైవదర్శనం కోసం యాదగిరిగుట్ట వెళ్లి వచ్చానని ఆయన చెప్పారు. గుండుతో, ఒంటి మీద గాయాలతో లక్ష్మణ్ కనిపించారు. విలేకరుల ముందుకు రావడానికి ఆయన చాలా సేపు ఇష్టపడలేదు. ఆయితే లక్ష్మణ్ కిడ్నాప్ జరిగిందనే ఎపిసిఎల్‌సి నాయకులు వాదిస్తున్నారు.
లక్ష్మణ్ పని చేస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద పౌర హక్కుల సంఘం కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ కూడా నిర్వహించారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.












Click it and Unblock the Notifications
