Home

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 07-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

కోవర్ట్‌ సిరాజ్‌ ను కాల్చిచంపిన వార్‌

హైదరాబాద్‌ః తమ వద్ద బందీగా ఉన్న కోవర్ట్‌ సిరాజ్‌ ను పీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు చంపేసారు. సిరాజ్‌ శవం గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో శుక్రవారం తెల్లవారు జామున కన్పించింది. పీపుల్స్‌ వార్‌ కు ద్రోహం చేసిన సిరాజ్‌ ను తామే చంపామని నక్సలైట్లు అతని శవం మీద ఒక లేఖ పెట్టారు.

చాలాకాలం పాటు పీపుల్స్‌ వార్‌ లో చురుకుగా పనిచేసిన సిరాజ్‌ డబ్బు కోసం కోవర్ట్‌ గా మారి పోలీసులకు సహకరిస్తున్నాడని పీపుల్స్‌ వార్‌ పేర్కొంది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని రెక్కి (దాడికి వ్యూహరచన) చేస్తున్న సమయంలో పోలీసులకు దొరికిన సిరాజ్‌ కోవర్ట్‌ గా మారాడని చెబుతున్నారు.

సిరాజ్‌ ను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ను తిరుమల టైగర్స్‌మని చెప్పుకునే వారు గురువారం రాత్రి కిడ్నాప్‌ చేశారు. సిరాజ్‌ ను నక్సలైట్లు చంపేయడంతో డాక్టర్‌ లక్ష్మణ్‌ కు ప్రాణహాని ఉండవచ్చని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి