Home
Posted on 07-11-03
హైదరాబాద్: సవరించిన కరువు అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పరిశీలక బృందానికి సమర్పించింది. కరువు పరిస్థితుల అధ్యయనానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్రు పరిశీలక బృందం ప్రతినిధులు శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలుసుకున్నారు.
తక్షణమే 860 కోట్ల రూపాయల సహాయం అందించాలని రాష్ట్రం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇది గతంలో కోరిన దాని కన్నా దాదాపు వందకోట్ల రూపాయలు తక్కువ. సహాయం అందించడానికి కేంద్రం తన మార్గదర్శక సూత్రాలను, విధానాలను మార్చుకోవాలని చంద్రబాబు కేంద్ర బృందం ప్రతినిధులతో అన్నారు. 14 లక్షల టన్నుల బియ్యం కూడా అందించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
తాము చేపట్టిన తాత్కాలిక, శాశ్వత కరువు నివారణ చర్యలను ఆయన కేంద్ర బృందానికి వివరించారు. తొమ్మింది మందితో కూడిన కేంద్ర బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాల్లో పర్యటించింది. తమ నివేదికను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి అందించి సహాయం అందించాల్సిందిగా కోరుతామని కేంద్ర బృందం ప్రతినిధులు చెప్పారు.












Click it and Unblock the Notifications
