Home
Posted on 08-11-03
హైదరాబాద్: అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వెలుగు పథకం అమలు తీరు పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వాధికారులతో మాట్లాడారు.
ఉపాధి కల్పన అవకాశాలపై ప్రధానంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ సాగింది. పది రోజుల్లో వివరాలను ఆన్‌లైన్ చేయడం పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక జాగ్రత్తగా, సాధ్యమైనంత తర్వగా జరగాలని ఆయన సూచించారు. ఉపాధి అవకాశాలు ఉన్న చోట్ల వాటిని వాడుకునే అవకాశాలు కల్పించాలని ఆయన అధికారులతో అన్నారు.












Click it and Unblock the Notifications
