Home
Posted on 08-11-03
హైదరాబాద్: స్థానిక సంస్థలకు అధికారాలను బదలాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం శనివారం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో శనివారం జరిగిన మంత్రి వర్గ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తూ అన్ని ప్రభుత్వ శాఖలకు ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. మంత్రి వర్గ సమావేశం వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. అధికారాల బదలాయింపులో ఎదురయ్యే అవరోధాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. నక్సలైట్ల హింసపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించిందని చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications
